SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 27 August 2026, 8:59 pm Posted by : SALAM PRODDATUR

ఎమ్మెల్సీ రమాదేవికి ఘన స్వాగతం

 

 

–జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ అభినందనలు

 

సలాం ప్రొద్దుటూరు –  అనంతపురం:

ఎమ్మెల్సీగా ఎన్నికైన అనంతరం తొలిసారిగా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి జెడ్పీ కార్యాలయానికి వచ్చిన దళవాయి రమాదేవికి జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ ఘన స్వాగతం పలికారు.

 

ఈ సందర్భంగా గిరిజమ్మ ఎమ్మెల్సీ రమాదేవికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్సీగా ఎన్నికైనందుకు అభినందనలు తెలియజేస్తూ, ఆమె పదవీకాలం విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.

 

జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్సీగా తొలిసారి హాజరైన రమాదేవిని జెడ్పీ చైర్‌పర్సన్ సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.