SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 26 August 2026, 2:02 pm Posted by : SALAM PRODDATUR

వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులకు ఎమ్మెల్యే ఆశీస్సులు

 

 

సలాం   ప్రొద్దుటూరు:

స్థానిక హౌసింగ్‌ బోర్డు పరిధిలోని TSR కల్యాణ మండపంలో రాజుపాలెం మండలం అయ్యవారిపల్లె గ్రామానికి చెందిన సింగం శివరామకృష్ణారెడ్డి వివాహ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వివాహ వేడుకలకు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో సాగాలని ఆకాంక్షించారు.

 

అదేవిధంగా టీడీపీ యువనాయకులు నంద్యాల కొండారెడ్డి కూడా వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.

 

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ బచ్చల పుల్లయ్య, టీడీపీ కడప పార్లమెంట్ అధికార ప్రతినిధి ఘంటసాల వెంకటేశ్వర్లు, కే.సీ. కెనాల్ ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్ ద్వార్శల గురివిరెడ్డి, మార్కెట్ యార్డు ఇన్‌చార్జి చైర్మన్ పట్నం లక్ష్మణ్ కుమార్, రాజుపాలెం మండల టీడీపీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, బూతూరు వెంకటరామిరెడ్డి, బూతూరు శివారెడ్డి, కుమ్మరిపల్లె వెంకటరామిరెడ్డి, గాలిపోతుల సుదర్శన్, బావికాడి బాబు, సురేంద్ర, వెంకట సుబ్బయ్య, భరత్ తదితరులు పాల్గొన్నారు.