మహమ్మద్ ప్రవక్త ﷺ వంశీయుల నడుమ.. ఘనంగా శాంతి ర్యాలీ..

సలాం ప్రొద్దుటూరు –   జమ్మలమడుగు మహమ్మద్ ప్రవక్త ﷺ జన్మదినాన్ని పురస్కరించుకుని జమ్మలమడుగు పట్టణంలో మీలాదున్నబీ వేడుకలు భక్తిశ్రద్ధలు, ఆధ్యాత్మిక వైభవంతో ఘనంగా నిర్వహించారు. ప్రవక్త వంశీయుల సాన్నిధ్యంలో వేలాది మంది ముస్లిం సోదరులు, చిన్నారులు పాల్గొన్న శాంతియుత ర్యాలీ పట్టణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.మెయిన్ బజార్‌లోని జామియా మసీదు నుంచి ప్రారంభమైన ర్యాలీకి జామియా మసీదు పీఠాధిపతి సయ్యద్ షా సాదిక్ భాషా ఖాద్రీ ఆధ్వర్యం వహించారు. మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, అర్బన్ సీఐ నరేష్‌బాబు, డీఎస్పీ వెంకటేశ్వరరావులు ర్యాలీని ప్రారంభించారు.జామియా...