ప్రవక్త బోధనలు సర్వమానవాళికి ఆదర్శం –ఎమ్మెల్యే పుట్టా
–ముస్లిం సోదరులకు మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు సలాం ప్రొద్దుటూరు – మైదుకూరు: పవిత్ర మిలాద్ ఉన్ నబీ ﷺ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదర, సోదరీమణులందరికీ మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మహమ్మద్ ప్రవక్త ﷺ మానవాళికి ప్రేమ, కరుణ, దయ, సోదరభావం, శాంతి, సామరస్యాన్ని బోధించారని పేర్కొన్నారు. ప్రవక్త ﷺ చూపిన సత్యం, న్యాయం, మానవతా మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని ఆకాంక్షించారు....