SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 26 August 2026, 2:52 pm Posted by : SALAM PRODDATUR

ప్రవక్త బోధనలు సర్వమానవాళికి ఆదర్శం –ఎమ్మెల్యే పుట్టా

 

 

–ముస్లిం సోదరులకు మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు

 

సలాం ప్రొద్దుటూరు –   మైదుకూరు:

పవిత్ర మిలాద్ ఉన్ నబీ ﷺ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదర, సోదరీమణులందరికీ మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

 

మహమ్మద్ ప్రవక్త ﷺ మానవాళికి ప్రేమ, కరుణ, దయ, సోదరభావం, శాంతి, సామరస్యాన్ని బోధించారని పేర్కొన్నారు. ప్రవక్త ﷺ చూపిన సత్యం, న్యాయం, మానవతా మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని ఆకాంక్షించారు. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని ఆయన కోరుకున్నారు. అన్ని వర్గాల ప్రజలు పరస్పర సోదరభావంతో, మత సామరస్యాన్ని కాపాడుతూ ముందుకు సాగాలని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆకాంక్షించారు.