SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 26 August 2026, 1:18 pm Posted by : SALAM PRODDATUR

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డ

 

పగిడాల దస్తగిరి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరైన ఎమ్మెల్యే

 

ప్రొద్దుటూరు: స్థానిక కొవ్వూరు గ్రాండ్‌లో తెలుగుదేశం పార్టీ నాయకులు పగిడాల దస్తగిరి కుమార్తె వివాహ రిసెప్షన్‌ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

 

ఈ సందర్భంగా నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే, వారు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. అనంతరం కుటుంబ సభ్యులను అభినందించి, వివాహ వేడుకలో పాల్గొన్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు, బంధుమిత్రులతో ఆత్మీయంగా ముచ్చటించారు.