ఇష్క్-ఏ-రసూల్ సందేశంతో ప్రొద్దుటూరులో ఘనంగా విశ్వశాంతి ర్యాలీ
సలాం ప్రొద్దుటూరు: మహమ్మద్ ప్రవక్త ﷺ జన్మదినాన్ని పురస్కరించుకుని ముస్లింలు పవిత్ర మిలాదున్ నబీ వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా సంప్రదాయ విశ్వశాంతి ర్యాలీని బుధవారం ప్రొద్దుటూరులో ఘనంగా నిర్వహించారు.అంజుమన్ అహ్లే ఇస్లాం కమిటీ, ప్రొద్దుటూరు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీ మైదుకూరు రోడ్డులోని నాజీరుల్లా షా ఖాద్రి దర్గా నుంచి ప్రారంభమై అసార్ షరీఫ్ వరకు కొనసాగింది. ర్యాలీలో వేలాది మంది ముస్లిం సోదరులు పాల్గొని శాంతియుతంగా ముందుకు సాగారు. ప్రవక్త మహమ్మద్ ﷺ బోధించిన శాంతి, సౌభ్రాతృత్వం, ప్రేమ, పరస్పర...