ఇష్క్-ఏ-రసూల్‌తో మార్మోగిన ప్రొద్దుటూరు.. ఘనంగా మిలాద్ ఉన్ నబీ ﷺ
సలాం ప్రొద్దుటూరు: మహమ్మద్ ప్రవక్త హజ్రత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహించే పవిత్ర మిలాద్ ఉన్ నబీ ﷺ వేడుకలు ప్రొద్దుటూరు పట్టణంలో మంగళవారం రాత్రి ఇస్లామిక్ సంప్రదాయాలు, ఆధ్యాత్మిక వాతావరణం నడుమ ఘనంగా జరిగాయి. అంజుమన్ అహ్లే ఇస్లాం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు ప్రొద్దుటూరుతో పాటు పరిసర ప్రాంతాల నుంచి వేలాది మంది తరలివచ్చారు.కులమతాలకు అతీతంగా ప్రజలు పాల్గొనడంతో ఆసరే షరీఫ్ ప్రాంతం మతసామరస్యం, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలిచింది. సుందరాచార్యుల వీధి, ఖాదర్...