మరణం తర్వాతా.. ఇద్దరి జీవితాల్లో వెలుగులు!

  –నేత్రదానంపై చైతన్యానికి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పిలుపు   –జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు ప్రారంభం.. అవగాహన పోస్టర్ల ఆవిష్కరణ   సలాం   పులివెందుల: మరణానంతరం నేత్రదానం ద్వారా ఇద్దరు అంధుల జీవితాల్లో వెలుగులు నింపే అవకాశం ఉందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. ప్రతి కుటుంబం నేత్రదానంపై అవగాహన పెంచుకుని స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.   జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా మంగళవారం పులివెందులలో స్నేహిత అమృత హస్తం సేవాసమితి నేత్ర సేకరణ కేంద్రం ఆధ్వర్యంలో...