SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 25 August 2026, 3:20 pm Posted by : SALAM PRODDATUR

బెంగళూరుకు ఎర్రచందనం అక్రమ రవాణా.. ఐదుగురు అరెస్ట్

 

–పాలెం గొల్లపల్లి నుంచి తరలిస్తుండగా పోలీసుల పట్టివేత

–రూ.10 లక్షల విలువైన ఆరు ఎర్రచందనం దుంగలు, షిఫ్ట్ కారు స్వాధీనం

సలాం ప్రొద్దుటూరు –  అన్నమయ్య  :

అన్నమయ్య జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. పాలెం గొల్లపల్లి నుంచి బెంగళూరుకు అక్రమంగా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి సుమారు రూ.10 లక్షల విలువైన ఆరు ఎర్రచందనం దుంగలతో పాటు అక్రమ రవాణాకు ఉపయోగించిన షిఫ్ట్ కారును స్వాధీనం చేసుకున్నారు.

అరెస్ట్ చేసిన నిందితులను పోలీసులు మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. చిత్తూరు జిల్లా పెనమలూరు మండలానికి చెందిన దయ, అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలానికి చెందిన రామాంజనేయులు, రాజశేఖర్, లోకేశ్వర, నాగార్జునలను నిందితులుగా గుర్తించినట్లు డీఎస్పీ కృష్ణమోహన్ తెలిపారు.

పోలీసులకు అందిన సమాచారం మేరకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టగా, ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్న వాహనం పట్టుబడినట్లు వెల్లడించారు. వాహనాన్ని తనిఖీ చేయగా ఆరు ఎర్రచందనం దుంగలు బయటపడినట్లు తెలిపారు.

ఎర్రచందనం అక్రమ రవాణా, అటవీ సంపదను దోచుకునే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని పోలీసులు స్పష్టం చేశారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ కృష్ణమోహన్ హెచ్చరించారు.

స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలు, వాహనాన్ని తదుపరి విచారణలో భాగంగా పోలీసులు పరిశీలిస్తున్నారు. నిందితుల వెనుక ఉన్న ఇతర వ్యక్తులు, అక్రమ రవాణా నెట్‌వర్క్‌పై కూడా దర్యాప్తు