SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 25 August 2026, 4:11 pm Posted by : SALAM PRODDATUR

గోపవరం పంచాయతీలో డ్రైనేజీ కాలువల పరిశీలన

 

–సమస్యలను గుర్తించి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు

 

సలాం ప్రొద్దుటూరు:

ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, టీడీపీ నాయకులు నంద్యాల కొండారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ బచ్చల పుల్లయ్యల సూచనల మేరకు టీడీపీ యువ నాయకుడు బచ్చల వీర ప్రతాప్ గోపవరం పంచాయతీ పరిధిలోని పలు ప్రాంతాల్లో డ్రైనేజీ కాలువలను పరిశీలించారు.శ్రీనివాసపురం పీడబ్ల్యూ ఆఫీస్ రోడ్డు కాలువ, సాయికుటి రోడ్డు మెయిన్ డ్రైనేజీ కాలువ, ఆచారి కాలనీ–వాసవి కళ్యాణ మండపం రోడ్డు ప్రధాన కాలువతో పాటు హౌసింగ్ బోర్డు పరిధిలోని డ్రైనేజీ కాలువలను ఆయన పరిశీలించారు. కాలువల పరిస్థితి, నీటి ప్రవాహానికి ఎదురవుతున్న ఇబ్బందులు, పారిశుద్ధ్య సమస్యలను అధికారులతో కలిసి పరిశీలించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు.డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా ఆయన అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కాలువల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించడం, నీటి ప్రవాహానికి ఆటంకాలు లేకుండా చూడడం వంటి చర్యలు చేపట్టాలని సూచించారు.ఈ పరిశీలనలో డీఎల్‌పీఓ నూర్జహాన్, పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ, టీడీపీ నాయకులు సీమల రాజశేఖర్ రెడ్డి, నాగేంద్ర, డి. గంగ సుధాకర్ యాదవ్, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.