కొర్రపాడులో టీటీడీ కళ్యాణ మండపం నిర్మించాలి
–టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును కలిసిన టీడీపీ నాయకులు సలాం ప్రొద్దుటూరు – తిరుపతి (టీటీడీ): ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలోని కొర్రపాడు గ్రామంలో టీటీడీ ఆధ్వర్యంలో కళ్యాణ మండపాన్ని నిర్మించాలని కోరుతూ టీడీపీ నాయకులు మెట్టుపల్లె రామచంద్రారెడ్డి, ధనిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళవారం టీటీడీ పాలకమండలి చైర్మన్ బీఆర్ నాయుడును కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి సిఫారసు మేరకు టీటీడీ చైర్మన్‌ను కలిసి కొర్రపాడులో కళ్యాణ మండపం నిర్మాణం అవసరాన్ని వివరించినట్లు నాయకులు తెలిపారు. గ్రామీణ ప్రాంత...