మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ప్రొద్దుటూరులో ఘనంగా గందోత్సవం

–జామియా మసీదు నుంచి గంధం సమర్పణ.. –ప్రత్యేక ప్రార్థనలు చేసిన వక్ఫ్ బోర్డు డైరెక్టర్ బేపారి జాకీర్   సలాం ప్రొద్దుటూరు: మిలాద్-ఉన్-నబీ (స.అ) సందర్భంగా ప్రొద్దుటూరు పట్టణంలో సోమవారం రాత్రి గందోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పట్టణంలోని వివిధ ప్రముఖ మస్జిద్‌ల నుంచి ప్రత్యేకంగా అలంకరించిన చాందినీలను, గంధాన్ని భక్తిశ్రద్ధలతో అసార్-ఏ-షరీఫ్ వీధికి తీసుకొచ్చారు.   ప్రతి మస్జిద్ నుంచి పాల్గొన్న భక్తులు నడుచుకుంటూ దరూద్-ఏ-షరీఫ్, నాత్-ఏ-షరీఫ్, ఖసీదాలు పఠిస్తూ గంధాన్ని భక్తిశ్రద్ధలతో తీసుకొచ్చారు. దీంతో అసార్-ఏ-షరీఫ్ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది....