మహమ్మద్ ప్రవక్త బోధనలతోనే సమాజంలో సమానత్వం
–మహిళలకు గౌరవం.. పేదలకు ఆత్మగౌరవం.. మానవత్వానికి మార్గదర్శకం –మీలాదున్నబీ శాంతి ర్యాలీని విజయవంతం చేయండి — జామియా మసీదు పీఠాధిపతి సయ్యద్ షా సాదిక్‌పాషా ఖాద్రి పిలుపు సలాం ప్రొద్దుటూరు – జమ్మలమడుగు: మహమ్మద్ ప్రవక్త బోధనలు సమాజంలో సమానత్వం, న్యాయం, మానవత్వానికి బలమైన పునాది వేశాయని జమ్మలమడుగు జామియా మసీదు పీఠాధిపతి సయ్యద్ షా సాదిక్ పాషా ఖాద్రి అన్నారు. మహిళలు, పేదలు, అణగారిన వర్గాల పట్ల గౌరవం, హక్కులు, సామాజిక న్యాయం వంటి విలువలను ప్రపంచానికి ప్రవక్త చాటి...