
–ఆసారే షరీఫ్‌ను దర్శించిన కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్
సలాం ప్రొద్దుటూరు:
ముస్లింల పవిత్ర పండుగ మీలాద్ ఉన్ నబీ (స అ) సందర్భంగా ప్రొద్దుటూరు పట్టణంలోని ఆసారే షరీఫ్‌ను మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ సోమవారం సాయంత్రం సందర్శించారు. అంజుమాన్ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు గంధం వేడుకలు జరిగే ప్రాంతాన్ని ఆయన సందర్శించి, ముస్లిం సోదరులకు మీలాద్ ఉన్ నబి (స అ) శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా అంజుమాన్ కమిటీ సభ్యులు కమిషనర్‌కు ఘన స్వాగతం పలికి, ముస్లిం సాంప్రదాయ పద్ధతిలో సత్కరించారు. ప్రజలతో మమేకమై పట్టణ అభివృద్ధి, పారిశుధ్య నిర్వహణకు ప్రాధాన్యతనిస్తూ కమిషనర్ అందిస్తున్న సేవలను కమిటీ సభ్యులు అభినందించారు.ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు లక్ష్యంగా చర్యలు, అలాగే ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పారిశుధ్య నిర్వహణలో కమిషనర్ తీసుకుంటున్న నిర్ణయాలు అభినందనీయమని వారు పేర్కొన్నారు. పట్టణ పరిశుభ్రతతో పాటు అన్ని వర్గాల ప్రజలతో సమన్వయంతో పనిచేస్తున్న తీరు ప్రశంసనీయమని అన్నారు.మీలాద్ ఉన్ నబి (స అ) సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం మత సామరస్యం, సోదరభావానికి ప్రతీకగా నిలిచింది.కార్యక్రమంలో అంజుమాన్ కమిటీ సభ్యులు ఇలియాస్ ఖురేషి, టీడీపీ నాయకులు ఖలీల్ బాషా, శానిటేషన్ సూపర్‌వైజర్ నూర్ భాషా తదితరులు పాల్గొన్నారు.
