SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 24 August 2026, 11:51 pm Posted by : SALAM PRODDATUR

మట్టి మసీదు నుంచి ఘనంగా గంధం

సలాం ప్రొద్దుటూరు:

మిలాద్-ఉన్-నబీ  అంటే ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) జన్మదినాన్ని స్మరించుకునే పర్వదినం.ఈ సందర్భంగా ముస్లింలు దరూద్-ఏ-షరీఫ్, నాత్-ఏ-షరీఫ్, ఖసీదాలు పఠించడం, ప్రత్యేక ప్రార్థనలు చేయడం, ప్రవక్త (స.అ) జీవిత సందేశాలను స్మరించుకోవడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.

గందోత్సవం సందర్భంగా మట్టి మసీదు నుంచి ప్రత్యేకంగా గంధాన్ని భక్తిశ్రద్ధలతో అసార్-ఏ-షరీఫ్‌కు తీసుకొచ్చారు. మసీదు కమిటీ సభ్యులు, భక్తులు నడుచుకుంటూ దరూద్-ఏ-షరీఫ్, నాత్-ఏ-షరీఫ్, ఖసీదాలు పఠిస్తూ గంధాన్ని తీసుకువచ్చారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.