నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న నర్సింగ్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలి
–సమగ్ర విచారణ చేపట్టాలి.. ఉల్లంఘనలు తేలితే కఠిన చర్యలు తీసుకోవాలి –ప్రగతిశీల విద్యార్థి సమైక్య (PSF) రాష్ట్ర అధ్యక్షుడు కొడవటికంటి నాగరాజు సలాం ప్రొద్దుటూరు – కడప: నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న నర్సింగ్ కళాశాలలపై సమగ్ర విచారణ చేపట్టి, నిబంధనల ఉల్లంఘనలు నిర్ధారణ అయితే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రగతిశీల విద్యార్థి సమైక్య (PSF) రాష్ట్ర అధ్యక్షుడు కొడవటికంటి నాగరాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు కడప కలెక్టరేట్ సభా భవనంలో నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి (DRO) మల్లికార్జున...