ఢిల్లీలో వర్షం ఎఫెక్ట్.. విమానాలకు బ్రేక్!
–15 విమానాలు దారి మళ్లింపు.. –రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ –రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ సలాం ప్రొద్దుటూరు – న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో జనజీవనం స్తంభించింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మొత్తం 15 విమానాలను ఇతర విమానాశ్రయాలకు దారి మళ్లించినట్లు అధికారులు వెల్లడించారు. దారి మళ్లించిన విమానాల్లో 12 విమానాలను జైపూర్‌కు,...