ప్రజా సమస్యల పరిష్కారం కోసం 24న కడప కలెక్టరేట్ వద్ద ధర్నా
సలాం ప్రొద్దుటూరు: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 24వ తేదీ సోమవారం కడప కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిర్వహించనున్న ధర్నాను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సత్యనారాయణ, సీఐటీయూ కార్యదర్శి బి. విజయకుమార్ పిలుపునిచ్చారు. శనివారం ప్రొద్దుటూరు ఎన్జీవో హోంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఆగస్టు 1వ తేదీ నుంచి ప్రజా సమస్యలపై నిర్వహిస్తున్న ‘సామాజిక శంఖారావం’ కార్యక్రమంలో భాగంగా వివిధ వార్డుల్లో పర్యటిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలు తమ దృష్టికి అనేక సమస్యలను తీసుకువచ్చారని...