SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 21 August 2026, 4:24 pm Posted by : SALAM PRODDATUR

ఇంటింటికీ తెలుగుదేశం.. ప్రజలతో మల్లెల లింగారెడ్డి ముఖాముఖి

 

సలాం   ప్రొద్దుటూరు:

ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి శుక్రవారం ప్రొద్దుటూరు 1 టౌన్ సర్కిల్ పరిధిలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలను, చిన్నచిన్న వ్యాపారస్తులను ప్రత్యక్షంగా కలిసి కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.ప్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాలను వివరించారు. ఈ సందర్భంగా ప్రజలు, వ్యాపారస్తుల నుంచి మంచి స్పందన లభించిందని టీడీపీ నాయకులు తెలిపారు. పలువురు కూటమి ప్రభుత్వానికి తమ సంపూర్ణ మద్దతును తెలియజేశారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కామిశెట్టి బాబు, ప్రొద్దుటూరు పట్టణ టీడీపీ మాజీ అధ్యక్షుడు శామీర్ భాషా, టప్పా మహబూబ్ భాషా, జిల్లెళ్ల వెంకటేష్, మాజీ కౌన్సిలర్ రామసంజీవరెడ్డి, కదిరి రామకృష్ణారెడ్డి, మేస్త్రి భాషా, ద్వార్శల వెంకటరెడ్డి, గిద్దలూరు ఈశ్వరయ్య, మహమ్మద్ రఫీ, సీజే సుబ్బయ్య, క్రిష్ణయ్య, షేక్ వల్లీతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.