స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్
సలాం ప్రొద్దుటూరు – అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.గ్రామపంచాయతీలు,మండల ప్రజా పరిషత్‌లు,జిల్లా ప్రజా పరిషత్‌లలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌ను పునరుద్ధరిస్తూ పంచాయతీరాజ్ శాఖ G.O.Ms.No.105,తేదీ:20-08-2026న ఉత్తర్వులు జారీ చేసింది.గతంలో అమల్లో ఉన్న 34 శాతం బీసీ రిజర్వేషన్ కొన్ని పరిణామాల నేపథ్యంలో 24.15 శాతానికి తగ్గిన విషయం తెలిసిందే.తాజా ఉత్తర్వులతో బీసీలకు మళ్లీ 34 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.దీంతో గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు...