‘షావుకారు’ జానకి కన్నుమూత

సలాం ప్రొద్దుటూరు –   చెన్నై, : తెలుగు చిత్రసీమలో తనదైన నటనా ముద్ర వేసిన ప్రముఖ సీనియర్‌ నటి ‘షావుకారు’ జానకి (95) కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దాదాపు ఏడున్నర దశాబ్దాల పాటు సినీ రంగంలో కొనసాగిన ఆమె తెలుగు, తమిళం తదితర భాషల్లో వందలాది చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించారు.   రాజమండ్రిలో జననం.. మద్రాసులో బాల్యం   తూర్పు గోదావరి జిల్లా...