“వైసీపీని ఎండగట్టడం కాదు.. అక్టోబర్‌లో ప్రజలే మిమ్మల్ని ఊరగాయ పెడతారు!” — రాచమల్లు
–నారా లోకేష్ పై రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు.. సలాం ప్రొద్దుటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. వైసీపీ నాయకులను ఎండగట్టడం కాదని, రాబోయే ఎన్నికల్లో ప్రజలే చంద్రబాబు, లోకేష్‌లకు తగిన సమాధానం చెబుతారని అన్నారు. దొరసానిపల్లె లోని మాజీ ఎమ్మెల్యే స్వగృహంలో శుక్రవారం పాత్రికేయుల సమావేశంలో రాచమల్లు మాట్లాడారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి నివాసంలో తెల్లవారుజామున ఈడీ సోదాలు నిర్వహించడం ద్వారా...