మోదీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ విధ్వంసం —కాంగ్రెస్
–కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పఠాన్ మహమ్మద్ అలీ ఖాన్ ధ్వజం సలాం ప్రొద్దుటూరు– కడప: గత 12 ఏళ్ల సుదీర్ఘ పరిపాలనలో ప్రధాని నరేంద్ర మోడీ భారతదేశంలో ఆర్థిక విధ్వంసం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పఠాన్ మహమ్మద్ అలీ ఖాన్ ధ్వజమెత్తారు. కడప ప్రెస్ క్లబ్ లో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత్ ఆర్థిక వ్యవస్థను పతనావస్థకు చేర్చారని దుయ్యబట్టారు. భారతీయ జనతా పార్టీ నాటి కేంద్ర ప్రభుత్వం, ప్రస్తుత ఎన్డీఏ...