SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 21 August 2026, 8:39 pm Posted by : SALAM PRODDATUR

టీడీపీ బలోపేతమే లక్ష్యం.. కార్యకర్తల ఐక్యతే బలం

 

–బద్వేల్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి నాయకులు, కార్యకర్తలు తరలిరావాలి

–జిల్లా పార్లమెంటు ప్రధాన కార్యదర్శి వై.ఎస్. జబీవుల్ల పిలుపు

సలాం ప్రొద్దుటూరు –   బద్వేల్:

బద్వేల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా విస్తృత స్థాయి చర్చా సమావేశాన్ని శనివారం నిర్వహించనున్నట్లు టీడీపీ జిల్లా పార్లమెంటు ప్రధాన కార్యదర్శి వై.ఎస్. జబీవుల్ల తెలిపారు.బద్వేల్ టీడీపీ ఇన్‌చార్జి మంచూరి సూర్యనారాయణ రెడ్డి, టీడీపీ జిల్లా పార్లమెంటు అధ్యక్షులు చదిపిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగనున్నట్లు ఆయన వెల్లడించారు.నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, బూత్ ఇన్‌చార్జులు, యూనిట్ ఇన్‌చార్జులు, క్లస్టర్ ఇన్‌చార్జులు, మండల ఇన్‌చార్జులు పెద్ద సంఖ్యలో పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాలని జబీవుల్ల పిలుపునిచ్చారు.పార్టీ భవిష్యత్ కార్యాచరణ, క్షేత్రస్థాయిలో సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడం, కార్యకర్తల సమన్వయం, ప్రజల్లో పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతంగా తీసుకెళ్లడం వంటి అంశాలపై సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు. స్థానికంగా పార్టీకి ఉన్న బలాబలాలను సమీక్షించి, రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై నాయకత్వం దిశానిర్దేశం చేయనున్నట్లు పేర్కొన్నారు.టీడీపీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని జబీవుల్ల కోరారు. కార్యకర్తల ఐక్యత, క్షేత్రస్థాయి సమన్వయంతో బద్వేల్ నియోజకవర్గంలో టీడీపీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఆయన తెలిపారు.