సలాం ప్రొద్దుటూరు – కడప :
ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం SIR-2026లో భాగంగా ఓటర్ల జాబితా అంశాలపై గురువారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ శ్రీ చేతన్ TS, IAS ఆధ్వర్యంలో గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం జరిగింది.సమావేశంలో SIR-2026 ప్రక్రియ, ఓటర్ల జాబితా సవరణ, అర్హులైన ఓటర్ల నమోదుతో పాటు జాబితాలోని అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో చర్చించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కడప జిల్లా పార్లమెంటు ప్రధాన కార్యదర్శి వై.ఎస్. జబీవుల్ల సమావేశంలో పాల్గొని పార్టీ తరఫున సంబంధిత అంశాలపై చర్చించారు.ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా సాగేందుకు రాజకీయ పార్టీల సహకారం, సూచనలు కీలకమని సమావేశంలో ప్రాధాన్యం ఇచ్చారు.
