SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 20 August 2026, 2:23 pm Posted by : SALAM PRODDATUR

187, 188 బూత్‌లలో ఇంటింటా టీడీపీ ప్రచారం

 

సలాం  ప్రొద్దుటూరు:

30వ వార్డు నాగేంద్ర ఆధ్వర్యంలో 187, 188 బూత్‌ల పరిధిలో నిర్వహించిన డోర్ టు డోర్ టీడీపీ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు ఇంటింటికీ వెళ్లి పార్టీ విధానాలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.స్థానిక ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటూ, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో బూత్ ఇన్‌చార్జీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.30వ వార్డు పరిధిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు సమష్టిగా కృషి చేస్తామని నాయకులు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ టీడీపీ నాయకులు, కార్యకర్తలు కృతజ్ఞతలు తెలిపారు.