మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులకు 12వ పీఆర్సీ ప్రకటించాలి

  –ఏపీఎంఈఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం డిమాండ్   సలాం ప్రొద్దుటూరు –  గుంటూరు : రాష్ట్రంలోని మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులకు వెంటనే 12వ పీఆర్సీ ప్రకటించి ఇంటరిమ్ రిలీఫ్‌ (ఐఆర్) మంజూరు చేయాలని ఏపీ మున్సిపల్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (APMEF) రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అలాగే ఆప్కాస్‌ ఉద్యోగుల నియామకాలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసి, ఆప్కాస్‌ ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేయాలని కోరింది.గుంటూరు మున్సిపల్ కార్యాలయంలో  ఏపీఎంఈఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. శంకర్రావు అధ్యక్షతన జరిగింది....