SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 20 August 2026, 11:13 pm Posted by : SALAM PRODDATUR

మండల, జెడ్పీల్లో రెండో ఉపాధ్యక్ష పదవి రద్దు

 

సలాం ప్రొద్దుటూరు –  అమరావతి:

ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లా పరిషత్‌ (జెడ్పీ), మండల పరిషత్‌ (ఎంపీపీ)ల్లో రెండో ఉపాధ్యక్ష పదవిని రద్దు చేస్తూ పంచాయతీరాజ్‌ చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.ఇకపై రాష్ట్రంలోని జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లలో ఒక్కొక్క ఉపాధ్యక్షుడు మాత్రమే ఉండనున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న రెండో ఉపాధ్యక్ష పదవులను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఈ మేరకు పంచాయతీరాజ్‌ చట్టానికి సవరణలు ప్రతిపాదిస్తూ రూపొందించిన బిల్లును పంచాయతీరాజ్‌ శాఖను పర్యవేక్షిస్తున్న ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ తరఫున మంత్రి నాదెండ్ల మనోహర్‌ శాసనసభలో ప్రవేశపెట్టారు. అనంతరం బిల్లుకు సభ ఆమోదం తెలిపింది.చట్ట సవరణ అమల్లోకి వచ్చిన తర్వాత జెడ్పీ, ఎంపీపీ పాలకవర్గాల్లో ఒక్కొక్క ఉపాధ్యక్ష పదవి మాత్రమే కొనసాగనుంది.