ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరు నిందితుల అరెస్ట్
–రైల్వే, ఇన్ఫోసిస్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం.. రూ.8 లక్షల నగదు స్వాధీనం సలాం ప్రొద్దుటూరు – పులివెందుల: రైల్వే, ఇన్ఫోసిస్ సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడిన ఇద్దరు నిందితులను పులివెందుల పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.8 లక్షల నగదును చట్టపరమైన ప్రక్రియలో స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, IPS ఆదేశాల...