మేయర్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌లకు ప్రత్యక్ష ఎన్నికలు

    సలాం ప్రొద్దుటూరు –  అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపాలిటీల చైర్‌పర్సన్‌ల ఎంపికకు ప్రత్యక్ష ఎన్నికల విధానాన్ని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్‌ పురపాలక శాసనములు 4వ సవరణ బిల్లుకు శాసనసభ బుధవారం ఆమోదం తెలిపింది. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు.ప్రస్తుతం మేయర్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌లను కౌన్సిలర్లు, కార్పొరేటర్లు పరోక్ష పద్ధతిలో ఎన్నుకుంటున్న నేపథ్యంలో ఎన్నికల విధానంలో మార్పు తీసుకురావాలని ప్రభుత్వం ఈ సవరణను...