సలాం ప్రొద్దుటూరు:
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బుధవారం మూడో రోజు శాసనసభ సమావేశాలకు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి హాజరయ్యేందుకు బయలుదేరారు. రాష్ట్ర, నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన అంశాలను అసెంబ్లీ వేదికగా ప్రస్తావిస్తూ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంపై ఎమ్మెల్యే దృష్టి సారించనున్నట్లు సమాచారం.