ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం సన్నాహాలు
సలాం ప్రొద్దుటూరు – అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. రాష్ట్రంలోని 100 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.ఇప్పటికే 87 మున్సిపాలిటీల పాలకవర్గాల పదవీకాలం పూర్తికాగా, మరో 13 పట్టణ స్థానిక సంస్థల పాలకవర్గాల గడువు నవంబర్‌లో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియను సకాలంలో పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేయాలని నిర్ణయించింది.ఎన్నికల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంతో సమన్వయం చేసుకుంటూ...