SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 18 August 2026, 4:58 pm Posted by : SALAM PRODDATUR

33వ వార్డులో విస్తృతంగా డోర్ టు డోర్

 

సలాం  ప్రొద్దుటూరు:

ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఆదేశాల మేరకు 33వ వార్డు పరిధిలోని PS నంబర్ 130లో డోర్ టు డోర్ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డు మాజీ కౌన్సిలర్ శివ జ్యోతి, TNTUC కడప పార్లమెంట్ అధ్యక్షుడు కుతుబుద్దీన్, PS-130 ఇన్‌చార్జి జహీర్ పాల్గొన్నారు.

వార్డు పరిధిలో ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుని, స్థానిక సమస్యలు మరియు ప్రజల అవసరాలను తెలుసుకుంటూ కార్యక్రమాన్ని కొనసాగించారు. ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ప్రజల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని నాయకులు తెలిపారు.