సభాపతి స్థానంలో వరదరాజులరెడ్డి.. ప్రొద్దుటూరు టీడీపీ శ్రేణుల్లో హర్షం
సలాం ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఎన్నో ఏళ్ల తర్వాత అసెంబ్లీ ప్యానెల్ స్పీకర్ పదవి దక్కడం పట్ల నియోజకవర్గ ప్రజలు, టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ప్యానెల్ స్పీకర్‌గా వ్యవహరిస్తూ గురువారం అసెంబ్లీలో సభాపతి స్థానంలో ఆసీనులై సభా కార్యక్రమాలను నిర్వహించారు. అసెంబ్లీలో స్పీకర్ స్థానంలో వరదరాజులరెడ్డి కూర్చొని సభను నడిపించిన దృశ్యాలు ప్రసార మాధ్యమాల్లో ప్రత్యక్ష ప్రసారం కావడంతో ప్రొద్దుటూరు నియోజక వర్గంలోని ఆయన అభిమానులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆసక్తిగా వీక్షించారు. తమ...