మార్పు మొదలైంది.. రెండు నెలల్లో ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు!

  –ప్రజల సహకారంతో స్వచ్ఛమైన, సుందరమైన ప్రొద్దుటూరును నిర్మిస్తాం– కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్   సలాం   ప్రొద్దుటూరు: “మార్పు మొదలైంది.. ప్రజలు కోరుకుంటే ఏదైనా సాధ్యమే” అంటూ ప్రొద్దుటూరు పట్టణాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు పురపాలక సంఘం కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ ప్రజలకు పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణతో పాటు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన ప్రొద్దుటూరు నిర్మాణమే లక్ష్యంగా మున్సిపాలిటీ ముందుకు సాగుతోందని తెలిపారు.   పట్టణంలోని వ్యాపారులు ప్లాస్టిక్ వినియోగంపై ఆలోచించడం ప్రారంభించారని, ఇదే మార్పుకు తొలి అడుగు అని కమిషనర్ పేర్కొన్నారు....