ప్యానల్ స్పీకర్‌గా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి

  సలాం ప్రొద్దుటూరు –  అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్యానల్ స్పీకర్లను ప్రకటించారు. ప్యానల్ స్పీకర్లుగా మండలి బుద్ధప్రసాద్‌, కోళ్ల లలిత కుమారి, జ్యోతుల నెహ్రూ, విష్ణుకుమార్‌ రాజు, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, దాసరి సుధలను నియమించారు.ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో సభా వ్యవహారాలను సజావుగా నిర్వహించేందుకు ప్యానల్ స్పీకర్లను ప్రకటించారు. ప్యానల్ స్పీకర్‌గా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డికి అవకాశం దక్కడం పట్ల ఆయన అనుచరులు, టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.ప్యానల్ స్పీకర్ల జాబితాలో...