SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 17 August 2026, 7:39 pm Posted by : SALAM PRODDATUR

ప్యానల్ స్పీకర్‌గా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి

 

సలాం ప్రొద్దుటూరు –  అమరావతి:

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్యానల్ స్పీకర్లను ప్రకటించారు. ప్యానల్ స్పీకర్లుగా మండలి బుద్ధప్రసాద్‌, కోళ్ల లలిత కుమారి, జ్యోతుల నెహ్రూ, విష్ణుకుమార్‌ రాజు, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, దాసరి సుధలను నియమించారు.ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో సభా వ్యవహారాలను సజావుగా నిర్వహించేందుకు ప్యానల్ స్పీకర్లను ప్రకటించారు. ప్యానల్ స్పీకర్‌గా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డికి అవకాశం దక్కడం పట్ల ఆయన అనుచరులు, టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.ప్యానల్ స్పీకర్ల జాబితాలో వరదరాజులరెడ్డికి చోటు దక్కడంతో ప్రొద్దుటూరు నియోజకవర్గానికి అసెంబ్లీలో మరో కీలక ప్రాతినిధ్యం లభించినట్లయింది.