త్రాగునీటి సమస్యలపై వార్డు అమినిటీస్ సెక్రటరీలతో కమిషనర్ సమీక్ష
–ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యం: కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ సలాం ప్రొద్దుటూరు: పట్టణంలో త్రాగునీటి సరఫరా, నాణ్యతకు సంబంధించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ప్రొద్దుటూరు పురపాలక సంఘం కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ వార్డు అమినిటీస్ సెక్రటరీలను ఆదేశించారు. సోమవారం వార్డు అమినిటీస్ సెక్రటరీలు, వాటర్ వర్క్స్ అధికారులు, సిబ్బందితో త్రాగునీటి సమస్యలపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రతి వార్డు అమినిటీస్ సెక్రటరీ తప్పనిసరిగా ప్రజా ఫిర్యాదుల రిజిస్టర్ నిర్వహించాలని...