స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలి

  –మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి   సలాం   ప్రొద్దుటూరు: 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి కార్యాలయంలో శనివారం జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకానికి వందనం చేసి, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు.అనంతరం మల్లెల లింగారెడ్డి మాట్లాడుతూ.. ఎందరో మహనీయుల త్యాగాలు, పోరాటాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం లభించిందన్నారు. వారి త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్యం కేవలం హక్కులను అనుభవించడమే కాకుండా దేశం పట్ల...