–మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి
సలాం ప్రొద్దుటూరు:
80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి కార్యాలయంలో శనివారం జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకానికి వందనం చేసి, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు.అనంతరం మల్లెల లింగారెడ్డి మాట్లాడుతూ.. ఎందరో మహనీయుల త్యాగాలు, పోరాటాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం లభించిందన్నారు. వారి త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్యం కేవలం హక్కులను అనుభవించడమే కాకుండా దేశం పట్ల బాధ్యతలను నిర్వర్తించడమని పేర్కొన్నారు.దేశ ఐక్యత, సమగ్రతను కాపాడుతూ సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని కోరారు. యువత విద్య, నైపుణ్యాలు, క్రమశిక్షణతో ముందుకు సాగి దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛత, పేదల సంక్షేమం వంటి అంశాలపై ప్రజల్లో చైతన్యం పెరగాల్సిన అవసరం ఉందన్నారు.ప్రొద్దుటూరు అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం అందరూ ఐక్యంగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.