SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 16 August 2026, 2:00 pm Posted by : SALAM PRODDATUR

విద్యార్థులు, వాకర్స్‌తో మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి

 

 

సలాం   ప్రొద్దుటూరు:

ప్రొద్దుటూరు పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి సందడి చేశారు. ఉదయం కళాశాల ఆవరణలో స్కేటింగ్ చేస్తున్న చిన్నారులను ఆయన కలుసుకుని వారితో ముచ్చటించారు.అదేవిధంగా వై.వి. ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాలకు చెందిన విద్యార్థులను కలిసి వారి విద్యా విషయాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కొంత సమయం ఆప్యాయంగా గడిపారు.అనంతరం పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో వాకర్స్‌ను కలిసి వారితో మాట్లాడారు. కళాశాల ప్రాంగణం విద్యార్థులు, యువతతో పాటు వాకర్స్‌కు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తోందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.