ఫిన్లాండ్‌కు బయలుదేరిన 29 మంది రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులు

  –రాష్ట్ర విద్యారంగానికి స్ఫూర్తిదాయక ఘట్టం.. –ఉపాధ్యాయుల ప్రతిభకు అంతర్జాతీయ గుర్తింపు సలాం ప్రొద్దుటూరు: విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని చాటుతూ రాష్ట్రంలోని 29 మంది ఉత్తమ ఉపాధ్యాయులు అంతర్జాతీయ శిక్షణ కోసం ఫిన్లాండ్‌కు బయలుదేరారు. విజయవాడ విమానాశ్రయం నుంచి శనివారం  వీరు ఫిన్లాండ్‌కు పయనమయ్యారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తింపు పొందిన వీరికి అంతర్జాతీయ స్థాయి శిక్షణకు అవకాశం కల్పించడం విద్యారంగంలో ఒక విశేష ఘట్టంగా నిలిచింది. ప్రొద్దుటూరు నుంచి ఫిన్లాండ్ వరకు.. షేక్ జవహర్ మున్నీర్ ఈ...