దేశభక్తి స్ఫూర్తిని నింపిన మైదుకూరు స్వాతంత్ర్య వేడుకలు

  –రాయల్‌ సర్కిల్‌లో జాతీయ పతాకావిష్కరణ.. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌ యాదవ్‌ దిశానిర్దేశం   సలాం ప్రొద్దుటూరు –   మైదుకూరు: 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మైదుకూరు నియోజకవర్గంలో నిర్వహించిన వేడుకలు దేశభక్తి స్ఫూర్తిని నింపాయి. ఎమ్మెల్యే  పుట్టా సుధాకర్‌ యాదవ్‌ పలు కార్యక్రమాల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు.   రాయల్‌ సర్కిల్‌లో జెండా వందనం   మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని రాయల్‌ సర్కిల్‌ వద్ద నిర్వహించిన జెండా వందనం కార్యక్రమంలో...