SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 16 August 2026, 1:32 am Posted by : SALAM PRODDATUR

దండపానిస్‌ హబ్‌ ఫర్నిచర్‌ స్టూడియో ప్రారంభం

 

 

 

సలాం  ప్రొద్దుటూరు:

 

దండపాని గ్రూప్‌ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘దండపానిస్‌ హబ్‌’ ఫర్నిచర్‌ స్టూడియో & ఇంటీరియర్స్‌ షోరూమ్‌ ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం ప్రొద్దుటూరులో ఘనంగా నిర్వహించారు.

 

ఈ కార్యక్రమానికి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, ఏపీ స్టేట్‌ షేక్‌ వెల్ఫేర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. వీఎస్‌ ముక్తియార్, సీఎం సురేష్‌ నాయుడు, రాజేశ్వరి సంస్కల అధినేత బసిరెడ్డి రాజేశ్వర్‌ రెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

 

ఈ సందర్భంగా అతిథులు నూతన షోరూమ్‌ను సందర్శించి, అక్కడ ఏర్పాటు చేసిన ఫర్నిచర్‌, ఇంటీరియర్స్‌ విభాగాలను పరిశీలించారు. అనంతరం దండపాని సంస్థల అధినేత కుమార్‌ను అభినందించారు. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఆధునిక ఫర్నిచర్‌, ఇంటీరియర్స్‌ సేవలను అందిస్తూ సంస్థ మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.నాణ్యమైన ఉత్పత్తులు, ఆధునిక డిజైన్లతో ‘దండపానిస్‌ హబ్‌’ ప్రొద్దుటూరు ప్రజలకు అందుబాటులోకి రావడం అభినందనీయమని అతిథులు పేర్కొన్నారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు, వ్యాపార ప్రముఖులు, స్థానిక నాయకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.