–ఉత్తమ సేవలకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చేతుల మీదుగా సత్కారం
సలాం ప్రొద్దుటూరు –తలమంచిపట్నం:
80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తలమంచిపట్నం పోలీస్ స్టేషన్ ఎస్సై హైమావతికి ఉత్తమ సేవలకు గుర్తింపుగా ప్రశంసాపత్రం లభించింది. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చేతుల మీదుగా ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు.
ఈ సందర్భంగా ఎస్సై హైమావతి మాట్లాడుతూ, తన సేవలను గుర్తించి ప్రశంసాపత్రం అందజేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
ఉత్తమ సేవలకు గుర్తింపుగా ప్రశంసాపత్రం అందుకున్న ఎస్సై హైమావతిని తలమంచిపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలు, స్థానికులు అభినందించారు.