ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలల భారీ ప్రదర్శన
–2029లో దళిత వ్యతిరేకుల పీఠాలు కదిలిస్తాం: మల్లెల వెంకటరావు సలాం ప్రొద్దుటూరు – జమ్మలమడుగు: ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జమ్మలమడుగులో ఆదివారం భారీ ర్యాలీ, ఆత్మీయ సమావేశం, బహిరంగ సభ నిర్వహించారు. మాలల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లెల వెంకటరావు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.కార్యక్రమంలో భాగంగా తొలుత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పాత బస్టాండ్ సమీపంలోని ఎల్‌ఎంసీ ప్రాంగణంలో వెంకటస్వామి అధ్యక్షతన ఆత్మీయ సమావేశం, బహిరంగ...