26 నెలలుగా రాష్ట్రంలో స్వాతంత్ర్యం ఎక్కడ ఉంది..? రాచమల్లు
–ప్రజలకు స్వేచ్ఛ, స్వాతంత్ర్యం లేకుండా పోయింది వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి సలాం ప్రొద్దుటూరు: భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 79 సంవత్సరాలు పూర్తయినా, ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు గత 26 నెలలుగా స్వేచ్ఛ, స్వాతంత్ర్యాన్ని అనుభవించడం లేదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి ఆరోపించారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కూటమి ప్రభుత్వ పాలనపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. శనివారం దొరసానిపల్లిలోని మాజీ ఎమ్మెల్యే స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.కూటమి...