జీవనజ్యోతి విద్యాసంస్థల్లో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

  –జాతీయ జెండా ఎగురవేసిన అమర్నాథ్ రెడ్డి.. ఆకట్టుకున్న చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు సలాం ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు పట్టణంలోని జీవనజ్యోతి విద్యాసంస్థల్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. విద్యాసంస్థల ప్రాంగణాలు జాతీయ జెండాలు, దేశభక్తి నినాదాలతో సందడిగా మారాయి.స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జీవనజ్యోతి విద్యాసంస్థల యజమాని అమర్నాథ్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకేతర సిబ్బంది, తల్లిదండ్రులు జాతీయ పతాకానికి వందనం చేసి దేశభక్తిని చాటుకున్నారు.ఈ సందర్భంగా జీవనజ్యోతి విద్యాసంస్థల...