SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 15 August 2026, 5:22 pm Posted by : SALAM PRODDATUR

కడప టీడీపీ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..

 

 

సలాం ప్రొద్దుటూరు   –కడప:

 

80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కడపలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో శనివారం జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి, పార్లమెంటు కార్యదర్శి వైఎస్ జబీవుల్లాతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించి దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయులను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశ ఐక్యత, సమగ్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు పరస్పరం స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.